News February 26, 2025

నిర్మల్: పది ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

image

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దారని డీఈవో రామారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News September 13, 2025

హుజూర్‌నగర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

image

హుజూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి అప్పారావు గుండెపోటుతో సెప్టెంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య గెల్లి అరుణ శనివారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

News September 13, 2025

అలంపూర్‌లో భక్తుల రద్దీ

image

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం మహా నివేదన సమయంలో భక్తులు దర్శనాల కోసం వేచి చూశారు. అనంతరం హారతులు అందుకున్నారు.

News September 13, 2025

బీటెక్ అర్హత.. CRDAలో 132 ఉద్యోగాలు

image

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(AP CRDA)లో 132 ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 చివరి తేదీ. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేయనున్నారు. ఆయా విభాగాల్లో బీటెక్ పాసైన వారు అర్హులు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం <>https://crda.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.