News February 26, 2025
నిర్మల్: పది ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దారని డీఈవో రామారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News March 22, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉ.8గంటల వరకు 33.0మీ.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 7.0, పలిమెల 4.0, ముత్తారం 1.0, కాటారం 4.3, మల్హర్రావు 1.5, చిట్యాల్ 2.5, టేకుమట్ల 3.3, మొగుళ్లపల్లి 2.0, రేగొండ 1.3, కొత్తపల్లిగోరి 1.3, భూపాలపల్లి 1.8మీ.మీటర్ల వర్షం నమోదయింది.
News March 22, 2025
నిన్న నైట్ ఏం చేశారు డ్యూడ్..?

ఎప్పట్లాగే AP, తెలంగాణలో నిన్న సాయంత్రం తర్వాత అంతా ఇళ్లకు చేరారు. అనంతరం APలో చూస్తే ఉదయం నుంచి బయట వేడికి తోడు రాత్రి ఇంట్లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి. ఇక తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం, రాత్రి, కరెంట్ కట్ కాంబోగా కలిసొచ్చాయి. ఇక హైదరాబాద్‌లో మిడ్‌నైడ్ భీకర ఉరుములు, మెరుపులతో వర్షం. సీన్ కట్ చేస్తే.. కరెంట్ కట్. భిన్న కారణాలతో AP, TGలో కామన్ మ్యాన్‌కు కామన్‌గా కునుకు లేదు. మీకు ఎలా ఉంది? కామెంట్!
News March 22, 2025
ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.