News March 24, 2025
నిర్మల్: పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో రామారావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9,100 మంది విద్యార్థులకు గాను 9,089 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News December 3, 2025
WNP: వాహనం అదుపుతప్పి.. వ్యక్తి మృతి

అమరచింత మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న కడుమూరు గ్రామానికి చెందిన రాజు (45) అమరచింత నుంచి చిన్న కడుమూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు అతణ్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 3, 2025
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

జె.పంగులూరు మండలం చందలూరులో బుధవారం రైతన్నా మీకోసం వారోత్సవాలు నిర్వహించారు. ఈ వర్క్షాప్లో బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
News December 3, 2025
నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.


