News March 19, 2025
నిర్మల్ : పరీక్షలకు 367మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 367మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తo 6416మంది విద్యార్థులకు పరీక్షకు కేటాయించగా ఇందులో 6049 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News November 16, 2025
సంగారెడ్డి: పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి, మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు సంగారెడ్డిలో జరిగాయి. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా జట్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్లు చింతా బలరాం, డా.గిరి, ఉపాధ్యక్షులు డా.శ్వేత, ఆంజనేయులు, యాదగిరి, ప్రధాన కార్యదర్శి వరప్రతాప్, సహాయ కార్యదర్శి అరుంధతి, వెంకటేశం, కోశాధికారి శివకుమార్ ఉన్నారు.
News November 16, 2025
సంగారెడ్డి: 18 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్: డీఈవో

ఈ నెల 18 నుంచి 20 ఖేడ్లోని ఈ-తక్షిలా పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ & ఇన్స్పైర్ అవార్డ్స్కు హాజరయ్యే విద్యార్థులు రెండు సెట్ల రైట్ అప్స్, సంబంధించిన వస్తువులు తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేసారు. అలాగే మూడు రోజులకు విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులను తీసుకురావాలని సూచించారు.
News November 16, 2025
అంబేడ్కర్ ప్రసంగం కంఠోపాఠం కావాలి: సీజేఐ

AP: రాజ్యాంగాన్ని దేశానికి అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం లాయర్లకు కంఠోపాఠం కావాలని CJI జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిరపత్రంగా చూడకుండా సవరణ విధానాలనూ పొందుపరిచారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కునూ కల్పించారు’ అని పేర్కొన్నారు.


