News March 15, 2025
నిర్మల్: పరీక్షలో 151 మంది విద్యార్థుల గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. మొత్తం 5,559 మంది విద్యార్థులకు గానూ 5,408 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 23, 2025
సిరిసిల్లకు అరుదైన గౌరవం

KNR DCC అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి MLA మేడిపల్లి సత్యం స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట. గతంలో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కటకం మృత్యుంజయం కరీంనగర్ శాసనసభ్యులుగా ఎన్నికై ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా సత్యం KNR DCC అధ్యక్షుడిగా నియమితులు కావడంతో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన రెండోవ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.
News November 23, 2025
HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది దొరికారు

సైబరాబాద్లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.
News November 23, 2025
ఎడారిగా మారిన గుంపుల మానేరు వాగు

ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరు నదిపై ఉన్న చెక్ డ్యాం కూలిపోవడంతో నది ఎడారిని తలపిస్తోంది. కార్తీక మాసం నవంబర్ 5న వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చిన మానేరు, కేవలం 15 రోజుల్లోనే నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు, శ్రీ రామభద్ర ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని చెక్ డ్యాంను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.


