News February 20, 2025
నిర్మల్: పలు మండలాల్లో నేడు పవర్ కట్

ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, మామడ మండలాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. నిర్మల్ నుంచి వచ్చే 132 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల్లో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Similar News
News October 14, 2025
రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్లు, CII ప్రతినిధులు, ఎక్స్పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
News October 14, 2025
పెన్షనర్ల కోసం ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్’ క్యాంపైన్

పెన్షనర్ల కోసం కేంద్రం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1-30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహా పెన్షనర్లకు నగదు అందించే 19 బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. 1.8 లక్షల పోస్ట్ మ్యాన్/గ్రామీణ డాక్ సేవక్లు ప్రతి పెన్షనర్ ఇంటికి వెళ్లి DLC జెనరేట్ చేస్తారు. సాధారణంగా పెన్షన్ కోసం ఏటా పెన్షనర్లే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
News October 14, 2025
పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. OCT 28 లాస్ట్ డేట్

TG పారామెడికల్ బోర్డు 2025- 26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిందని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RGM) ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ తెలిపారు. DMLT, డయాలసిస్ కోర్సుల్లో చెరో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు OCT 28 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://tgpmb.telangana.gov.in వైబ్సైట్ చూడొచ్చు.