News February 20, 2025
నిర్మల్: పలు మండలాల్లో నేడు పవర్ కట్

ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, మామడ మండలాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. నిర్మల్ నుంచి వచ్చే 132 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల్లో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Similar News
News March 17, 2025
కర్నూలు: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆదివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని మెలిగుట్ట దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శరీరం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ 9121101152కి సంప్రదించాలని సూచించారు.
News March 17, 2025
కోనసీమ: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈవో షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏ ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9493819102కు తెలియజేయాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసి స్క్వాడ్లను నియమించామన్నారు.
News March 17, 2025
పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పెద్దకొత్తపల్లి మండలం పరిధి దేవుని తిరుమల పూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలానికి చెందిన పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ రాజు అతడి భార్య, కూతురు అనూషతో కలిసి వనపర్తి నుంచి బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరిని ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడగా అనూష అక్కడికక్కడే చనిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.