News February 12, 2026
నిర్మల్: పల్లెలో పౌరుషం.. పట్నంలో ఏది..?

ఎన్నికలంటే ఉండే ఆ జోష్, పౌరుషం పట్నంలో కనిపించలేదు. మున్సిపల్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతమైన ఖానాపూర్ మున్సిపాలిటీలో 74.83% ఫర్వాలేదనిపించినా, విద్యావంతులు ఎక్కువగా ఉండే నిర్మల్‌లో 65.47%, భైంసాలో 62.67% తక్కువ నమోదు కావడం ఆందోళనకరం. సెలవు దినాన్ని ఎంజాయ్ చేయడానికే పరిమతమయ్యారు తప్ప, ఓటు హక్కు వినియోగించుకోవడంలో పట్టణ ఓటరు బద్ధకం వీడలేదు.
Similar News
News March 17, 2026
KTR వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

TG: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు <<19405508>>ఎందుకు<<>> చెప్పాలన్న KTR వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనందుకు, మేం కొత్త కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తున్నందుకు KTR ధన్యవాదాలు చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నందుకు థాంక్స్ చెప్పాలి’ అని స్పష్టం చేశారు.
News March 17, 2026
పెద్దల రుణాలు రైటాఫ్.. పేదల అప్పులపై కఠినం.. కావాలి మానవత్వం!

పేదలు, రైతులు తీసుకొన్న అప్పులను ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు ‘పెద్దల’ రుణాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. 11 ఏళ్లలో ఏకంగా రూ.9.75 లక్షల కోట్ల అప్పులను రైటాఫ్ చేసినట్లు కేంద్రం పార్లమెంటులో చెప్పడంతో చర్చ మొదలైంది. పేదల రుణాల వసూళ్లలోనూ మానవత్వంతో సున్నితంగా వ్యవహరించాలని పలువురు పేర్కొంటున్నారు. కట్టడం ఆలస్యమైతే వడ్డీల బాదుడు నుంచి విముక్తి కలిగించాలంటున్నారు. మీరేమంటారు?
News March 17, 2026
విశాఖ: అవినీతి ఆరోపణలు.. నలుగురు పోలీసుల బదిలీ

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తనదైన శైలిలో కొరడా ఝలిపిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లు గోపికృష్ణ, అగస్టీన్, శివకృష్ణ, సుధాకర్‌లను నగరంలోని పలు స్టేషన్‌లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాలుగు రోజులు ముందే డీవోలు సిద్ధమైనా.. సంబంధిత స్టేషన్‌కు ఆలస్యంగా అందాయి.


