News March 27, 2024
నిర్మల్: పాముకాటుతో యువరైతు మృతి

నాటువైద్యం వికటించి రైతు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలంలో జరిగింది. SI యాసిర్ ఆరాఫత్ వివరాలు.. గొడిసిర్యాల గొండుగూడకు చెందిన మెస్త్రం భుజంగరావ్(23)కు ఈనెల 18న పాముకాటు గురయ్యారు. ఓ నాటు వైద్యుడికి రూ.10వేలు ఇచ్చి వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 25న నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News April 20, 2025
ADB ITI కళాశాలలో రేపు అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ అందజేస్తామన్నారు.
News April 20, 2025
ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్ లాగ్) పరీక్షలు వాయిదా వేశామని, మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News April 19, 2025
మ భూమి రథయాత్రతో సమస్యల పరిష్కారం: విశారదన్ మహరాజ్

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర తోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సకల సమస్యల పరిష్కారానికి మార్గం లభిస్తుందని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ బస్తీల్లో కొనసాగిన మాభూమి రథయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బస్తీల్లో ఉన్న సమస్యలను వెంటనే కలెక్టర్, మునిసిపల్ అధికారులు పరిష్కరించాలని లేనిపక్షంలో తీవ్రం నిరసన ఉంటుందని అన్నారు.