News April 14, 2025
నిర్మల్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 18, 2025
ఆదిలాబాద్: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తలమడుగు మం. ఉమ్రి ఆశ్రమ బాలిక పాఠశాల విద్యార్థిని పినాయిల్ తాగిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల ప్రకారం.. దసర సెలవులకు వెళ్లిన ఓ విద్యార్థిని తల్లిదండ్రులను బట్టలకు డబ్బులు అడిగింది. వారు నిరాకరించడంతో పాఠశాలకు వెళ్లింది. గురువారం రాత్రి బాత్రూంకి వెళ్లి పినాయిల్ తాగింది. గమనించిన సిబ్బంది ఆమెను PHCకి, అక్కడి నుంచి RIMSకి తరలించగా చికిత్స పొందుతోంది. సమాచారంతో కుటుంబీకులు రిమ్స్కు చేరుకున్నారు.
News October 18, 2025
మాక్ అసెంబ్లీ.. 21 నుంచి విద్యార్థుల ఎంపిక

AP: అమరావతిలో వచ్చే నెల 26న విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అందుకోసం ఈ నెల 21, 22 తేదీల్లో 6-8 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు జరగనున్నాయి. 24, 25 తేదీల్లో మండలస్థాయి పోటీలు, ఈ స్థాయి నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేసి 29, 30 తేదీల్లో నియోజకవర్గ లెవల్లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 175 మందిని ఎంపిక చేసి అమరావతి అసెంబ్లీకి తీసుకెళ్తారు.
News October 18, 2025
గాజువాక: టిప్పర్ బీభత్సం.. మహిళ మృతి

గాజువాక సమతా నగర్లో దారుణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం భారీ టిప్పర్ రోడ్డు పక్కన కొబ్బరిబోండాలు అమ్ముతున్న వియ్యపు అప్పయ్యమ్మపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న బాలుడికి గాయాలు అయ్యాయి. న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిద్రమత్తులో వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.