News April 14, 2025
నిర్మల్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 19, 2026
మరోసారి సిద్ధార్థ్-త్రిష కాంబోలో మూవీ?

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో క్యూట్ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్-త్రిష జోడీ మళ్లీ రిపీట్ కానుందా? అంటే ఫిలిమ్ సర్కిల్స్‌లో అవుననే బజ్ నడుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని.. ఓ కొత్త డైరెక్టర్‌తో సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా చివరగా త్రిష-సిద్ధార్థ్ అరణ్మనై-2 అనే హారర్ మూవీలో నటించారు.
News April 19, 2026
నెల్లూరు: ఉప్పు కాలువలో పడి వ్యక్తి మృతి.. ఇతను మీకు తెలుసా?

తోటపల్లి గూడూరు మండలం కొత్త పట్టపుపాలెం వద్ద ఉన్న ఉప్పు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉండవచ్చు. అతని ఎడమ చేతి మీద గిరిజ అని పచ్చ బొట్టు ఉంది. గోధుమ రంగు కలర్ పై బ్లూ, పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న ఫుల్ షర్ట్, తెల్లటి బనియన్, నల్లని నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.