News July 31, 2024

నిర్మల్: పూజించిన పామే కాటేసింది.!

image

తన ఇంట్లో నాగుపాము ఉందని తెలిసి ఓ వృద్ధురాలు కొన్నేళ్లుగా పాముకు పూజలు చేయగా.. చివరకు ఆ పాముకాటుకు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసంపల్లె‌కి చెందిన గంగవ్వ(65) అంగన్‌వాడీ‌ ఉద్యోగిగా రిటైరై ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం ఇంట్లో అలుకుతుండగా తాను పూజించిన పాము చేతిపై పలుమార్లు కాటు వేసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.

Similar News

News December 16, 2025

ADB: ఇప్పటికి రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం: ఎస్పీ

image

ఎన్నికల నియమావళి ప్రారంభమైనప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు రూ.20 లక్షల విలువైన 2,554 లీటర్ల మద్యం, 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు 70 కేసుల్లో 200 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నగదు, బహుమతులకు ప్రలోభపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

News December 16, 2025

ADB: మూడో విడత ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఐదు మండలాల్లోని 151 జీపీలలో గల 204 పోలింగ్ కేంద్రాల వద్ద 938 మంది సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. ఇప్పటికే 756 మందిని బైండోవర్ చేశామని, అక్రమ మద్యం రవాణా జరగకుండా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.

News December 16, 2025

అ పంచాయితీ కి 19 ఏళ్లుగా సర్పంచ్ లేడు.. అది ఎక్కడంటే

image

జిల్లాలో ఆ పంచాయతీ ది, అందులో 5 వార్డుల విచిత్రమైన పరిస్థితి. ఆ పంచాయతీ పరిధిలో ఒక్కరు కూడ ఎస్టీ తెగకు చెందిన వాళ్ళు లేకున్నా ఆ పంచాయతీ మాత్రం 19 ఏళ్లుగా ఎస్టీ గానే రిజర్వేషన్ కొనసాగుతూ వస్తుంది. దీంతో ఆ పంచాయతీకి సర్పంచ్ లేక ఉప సర్పంచే సర్పంచ్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఈ విచిత్రమైన పంచాయతీ తలమడుగు మండలంలోని రుయ్యాడి పరిస్థితి. దీంతో 19 ఏళ్లుగా సర్పంచ్, 5 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు.