News March 19, 2025
నిర్మల్: పోటీ పరీక్షలపై దృష్టి సారించాలి : ఫైజాన్ అహ్మద్

విద్యార్థులు డిగ్రీ స్థాయి నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు గ్రూప్స్ ,సివిల్స్ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే సులభంగా ర్యాంకులను సాధించవచ్చని పేర్కొన్నారు. పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Similar News
News March 20, 2025
జగిత్యాల: అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలో గురువారం నిర్వహించిన డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డిఎస్పీలు రఘుచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
News March 20, 2025
OFFICIAL: చాహల్, ధనశ్రీ విడాకులు

భారత క్రికెటర్ చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్పై ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. దీనికోసం ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. అందులో కొంత మొత్తాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ తీర్పు కోసమే చాహల్ IPL జట్టులో ఇంకా చేరకుండా ఉన్నారు.
News March 20, 2025
నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు వంటి పూట బడులను నిర్ధిష్ట వేళలు పాటించకుండా ఇస్తాను సారంగా నడిపితే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ గురువారం అన్నారు. ఈ విషయంపై తమ దృష్టికి వస్తే పాఠశాలల మూసివేతకు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు. ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలనను ప్రైవేట్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.