News April 16, 2025

నిర్మల్: పోలీస్ అక్క కార్యక్రమంలో చేసేవి ఇవే..!

image

వసతి గృహాల్లోని విద్యార్థులకు అండగా నిలవాలని జిల్లా సూచించారు. జిల్లాలోని 18 కేజీబీవీ పాఠశాలల మహిళా కానిస్టేబుళ్లతో మంగళవారం పోలీస్ అక్క.. కార్యక్రమంపై ఎస్పీ కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. పోలీసులు విద్యార్థులతో కలిసి బస చేయడంతో విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా వారి సమస్యలను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఎలా మెలగాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలన్నారు.

Similar News

News November 21, 2025

జడేజాను వదులుకోవడంపై ఆశ్చర్యపోయా: కుంబ్లే

image

స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను CSK వదులుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నారు. ‘మామూలుగా CSK తమ ప్లేయర్లను వదులుకోదు. ముఖ్యంగా చాలా కాలంగా కొనసాగుతున్న జడేజా లాంటి వారిని అస్సలు వెళ్లనివ్వదు’ అని చెప్పారు. జడేజాను రాజస్థాన్, శాంసన్‌ను CSK తీసుకోవడం పెద్ద పరిణామం అని తెలిపారు. అయితే జడేజాకు RR మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్న అన్నారు.

News November 21, 2025

పకడ్బందీగా పంట కొనుగోలు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో అన్ని పంటల కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పంటల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి, సోయా, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అన్ని పంటలను కొనుగోలు చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

News November 21, 2025

ADB: జాతీయ రహదారిని అడ్డుకోవడం చట్టరీత్య నేరం: డీఎస్పీ

image

జాతీయ రహదారిపై అత్యవసర సేవల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని వాటిని అడ్డుకోవడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని ADB డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. యువత కేసుల బారిన పడకుండా వారి భవిష్యత్తులను నాశనం చేసుకోకూడదని తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక, వాహనాలు ఆస్పత్రిలకు వెళ్లేవారికి అసౌకర్యం కలిగే చర్యలు చేయవద్దన్నారు. యువత కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోకుండా ఉండాలని సూచించారు.