News February 5, 2025
నిర్మల్: పోలీస్ క్రీడాకారులను అభినందించిన ఎస్పీ

రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్లో పతకాలు సాధించిన నిర్మల్ పోలీస్ క్రీడాకారులను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. మహిళ కానిస్టేబుల్ కళ్యాణి బంగారు పతకం, కానిస్టేబుల్ ముత్యం కాంస్య పతకం సాధించారు. దీంతో వారిని ఆమె కార్యాలయంలో అభినందించారు.
Similar News
News January 9, 2026
గోదావరి నది హారతికి మంచి స్పందన: కలెక్టర్

గత రెండు శనివారాలలో భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద నిర్వహించిన నది హారతి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజల సౌకర్యం, స్థానిక సంప్రదాయాల పరిరక్షణ, అలాగే కార్యక్రమానికి మరింత విస్తృత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఇకపై ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News January 9, 2026
అన్నమయ్య: ఈ నంబర్ గుర్తు పెట్టుకోండి..!

సంక్రాంతి వేళ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని అన్నమయ్య జిల్లా రవాణాశాఖ అధికారి కె.ప్రసాద్ సూచించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్టు క్యారేజ్ బస్సు యజమానులు, ఆపరేటర్స్తో సమావేశం నిర్వహించారు. అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాలని కోరారు. హెల్ప్ లైన్ నంబర్ 9281607001 బస్సులో స్పష్టంగా రాయాలని ఆదేశించారు.
News January 9, 2026
మున్సిపాలిటీల అభివృద్ధికి సర్కార్ కట్టుబడి ఉంది: పొంగులేటి

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.3.17 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కనకయ్యతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇల్లందు మున్సిపాలిటీకి మహర్దశ పడుతుందని పేర్కొన్నారు.


