News February 5, 2025
నిర్మల్: పోలీస్ క్రీడాకారులను అభినందించిన ఎస్పీ

రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్‌లో పతకాలు సాధించిన నిర్మల్ పోలీస్ క్రీడాకారులను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. మహిళ కానిస్టేబుల్ కళ్యాణి బంగారు పతకం, కానిస్టేబుల్ ముత్యం కాంస్య పతకం సాధించారు. దీంతో వారిని ఆమె కార్యాలయంలో అభినందించారు.
Similar News
News January 14, 2026
NLG: పుర పోరు.. రిజర్వేషన్లపై ఉత్కంఠ!

జిల్లాలోని మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ఖరారుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. వార్డులు, డివిజన్లు ఏ వర్గానికి దక్కుతాయోననే టెన్షన్ అందరికి పట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాక ఓపెన్ కేటగిరీకి డిమాండ్ భారీగా పెరగనుంది. చాలామంది గత రిజర్వేషన్లను అంచనా వేసుకుని వార్డులు, డివిజన్లలో ప్రజలతో మమేకమవుతున్నారు. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందనే ఆశతో క్షేత్రస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
News January 14, 2026
నేడే జ్యోతి దర్శనం.. కిక్కిరిసిన శబరిగిరులు

అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది. సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
News January 14, 2026
పతంగ్‌కు పక్కా ప్లాన్.. చెరువు వద్ల కుర్రాళ్ల చిల్ అవుట్!

డాబాల మీద డీజే గోల, పతంగుల కోసం కొట్లాటలకు ఈ తరం కుర్రాళ్లు గుడ్ బై చెప్పేస్తున్నారు. నెక్లెస్ రోడ్, గండిపేట లాంటి చెరువు గట్లనే తమ పతంగ్ అడ్డాగా మార్చుకుంటున్నారు. తెల్లవారుజామునే చాయ్ థర్మోస్, ఫోల్డబుల్ కైట్స్, మ్యూజిక్ కోసం చిన్న బ్లూటూత్ స్పీకర్‌తో అక్కడ వాలిపోతున్నారు. రొటీన్ రచ్చకు దూరంగా, ప్రశాంతమైన గాలిలో గాలిపటాలు ఎగరేస్తూ సరికొత్త ‘యాంటీ నాయిస్’ కల్చర్‌కు తెరలేపుతున్నారు. మీకూ నచ్చిందా?


