News March 17, 2025

నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

image

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఖానాపూర్, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బయల్దేరుతుందని వెల్లడించారు.

Similar News

News December 7, 2025

తిరుపతి: వర్సిటీలో దారుణం.. రేపు లోక్ సభలో చర్చ.?

image

తిరుపతి NSU <<18496982>>వివాదంపై<<>> YCP ఎంపీలు లోక్ సభలో చర్చకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా లోక్ సభ స్పీకర్‌ను కోరనున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

News December 7, 2025

MBNR: కాంగ్రెస్ ప్రజా వంచన పాలన: MP

image

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలుచేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.

News December 7, 2025

ఆదిలాబాద్: ‘అప్పులైనా సరే.. గెలుపే ముఖ్యం’

image

ADB జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి ఏర్పడింది. రోజు తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, ప్రజల మధ్య పరస్పర భేటీ జరుగుతోంది. అప్పులకు పాలవ్వకుండా సర్పంచ్ పదవికి దూరంగా ఉండాలని పలువురు చెపుతున్నప్పటికీ..ఎంత అప్పులైనా సరే, తమకు గెలుపే ముఖ్యం అంటూ ఓ వైపు అభ్యర్థులు అంటున్నారు. ఈ నెల 11న తోలి విడత పోలింగ్ ఉండడంతో కనీసం విశ్రాంతి తీసుకోకుండా ప్రచారాలు చేస్తున్నారు.