News March 17, 2025

నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

image

ఖానాపూర్ నుంచి మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బస్సు బయల్దేరుతుందని వెల్లడించారు.

Similar News

News February 23, 2026

అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 45 కేంద్రాల్లో 8,157 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News February 23, 2026

ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

image

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.

News February 23, 2026

సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 16 కేంద్రాలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షాల నిర్వహణకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ 4046 మంది, సెకండ్ ఇయర్ 4060 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమనే నిబంధన తొలగించారని, నిర్ణీత సమయానికి 5 నిమిషాలలోగా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని ఆమె సూచించారు.