News August 7, 2024

నిర్మల్: ప్రజలతో మమేకమై పోలీసుల పని చేయాలి: డీఎస్పీ

image

ప్రజలతో మమేకమై పోలీసులు పనిచేయాలని నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఖానాపూర్‌లోని సీఐ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ మండలాల ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేసిన అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావు, ఎస్ఐలు ఉన్నారు.

Similar News

News November 9, 2025

ADB: రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు కోచ్‌లు అందుబాటులోకి తెచ్చినట్లు డివిజన్ ప్రజా సంబంధాల అధికారి రాజేష్ షిండే తెలిపారు. నాందేడ్- మన్మాడ్- నాందేడ్ ప్యాసింజర్, పూర్ణ- ఆదిలాబాద్ రైళ్లకు ఆదివారం నుంచి అదనపు కోచ్‌లు ఉంటాయి. ఆదిలాబాద్- పర్లి ప్యాసింజర్, వైజ్నాథ్- అకోలాకు ఈ నెల 10 నుంచి, అకోలా-పూర్ణ, పర్లివైజ్నాథ్- పూర్ణ రైళ్లకు ఈ నెల 11 నుంచి కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు.

News November 8, 2025

తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.