News February 13, 2025
నిర్మల్: ప్రేమ పేరుతో యువతి హత్య

ప్రేమ పేరుతో ఓ యువతిని హత్య చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కోర్టు అధికారి డల్లు సింగ్ వివరాల ప్రకారం.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన యువతిని 5 సంవత్సరాల నుండి వేధిస్తూ ఉండేవాడు. అనంతరం ఆమెకు వివాహం జరుగుతుందని తెలుసుకొని వెంటపడి చంపేయగా బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది.
Similar News
News March 14, 2025
హనుమకొండ: ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ పి.ప్రావిణ్య జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.
News March 14, 2025
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు: హరీశ్‌రావు

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ను ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు.
News March 14, 2025
హోళీ పండుగపై కడప ఎస్పీ సూచనలు

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హోళీ పండుగ శుభాకాంక్షలతో పాటు పలు సూచనలు చేశారు. హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలన్నారు. అన్ని మతాలవారు మతసామరస్యం పాటిస్తూ ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా హద్దులు దాటితే ఉపేక్షించమని, ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.