News May 1, 2024
నిర్మల్: బట్టలను ఇస్త్రీ చేసి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలం లక్కారాం గ్రామంలో గడప గడపకు మండల నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ లాండ్రి షాప్‌లో ఎమ్మెల్యే బట్టలను ఇస్త్రీ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.
Similar News
News January 12, 2025
జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్‌లో పర్యటించిన హైకోర్టు జడ్జి
కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్ పెళ్లి రేంజ్ అడవులలో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణహైకోర్టు జడ్జి రాధారాణి కుటుంబ సమేతంగా పర్యటించారు. ముందుగావారికి పోలీసులు అటవీ శాఖ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జంగల్ సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లి అందాలను తిలకించారు. అటవీ అధికారులువారికి అన్ని ఏర్పాట్లు చేశారు.
News January 12, 2025
గెలుపోటములు సమానంగా స్వీకరించాలి: ASF SP
క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని జిల్లా SPశ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో స్నేహపూర్వక వాతావరణంలో పోలీస్, ప్రెస్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో పోలీస్ టీం విజేతగా నిలిచింది. విజేత, రన్నరప్ టీంలకు SP బహుమతులు అందజేశారు.
News January 12, 2025
జన్నారం: కొత్తూరుపల్లిలో మహిళ హత్య
జన్నారం మండలం కొత్తూరుపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఎస్ఐ రాజ వర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మడావి కౌసల్య అనే మహిళకు అదే గ్రామానికి చెందిన కృష్ణతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణ గొడ్డలితో కౌసల్యను నరికి చంపాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.