News March 11, 2025
నిర్మల్: ‘బాలశక్తితో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు’

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి అందించిన వాహనాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహోన్నతమైన బాలశక్తి కార్యక్రమానికి ఈ వాహనం, విద్యార్థుల సంక్షేమానికి, ఆరోగ్య సంరక్షణకు దోహదం చేస్తుందన్నారు.
Similar News
News March 15, 2025
సాలూరు : మున్సిపల్ కమిషనర్ సరెండర్

సాలూరు మున్సిపల్ కమిషనర్ విహెచ్ సత్యనారాయణను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. గురువారం రాత్రి మన్యం జిల్లా కలెక్టర్ నిర్వహించిన జూమ్ మీటింగ్ కమిషనర్ పాల్గొనకపోవడం, మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం తదితర కారణాల వలన సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.
News March 15, 2025
ఖమ్మం: భార్యతో గొడవ.. భర్తను అప్పగించిన పోలీసులు

భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లగా మధిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఖమ్మం 3టౌన్‌కు చెందిన D.శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం తన భార్యతో గొడవపడి, ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. శుక్రవారం మధిరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శ్రీనివాసరావును కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News March 15, 2025
గుంటూరు ఛానల్లో గల్లంతైన బాలుడి మృతి

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రొక్లెయినర్ డ్రైవర్ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్‌కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు.