News April 10, 2025
నిర్మల్: బాలశక్తి పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ అభిలాష

బాలశక్తి కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలశక్తి పక్కగా అమలు అయ్యేటట్టు ప్రణాళిక బద్ధమైన రీతిలో ముందుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈఓ రామారావు, సలోమి, కరుణ, లింబాద్రి ఉన్నారు.
Similar News
News April 25, 2025
నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు.
News April 25, 2025
భూ సమస్యల సత్వర పరిష్కారానికే భూ భారతి: SRPT కలెక్టర్

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మునగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.
News April 25, 2025
సిరిసిల్ల: తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి: ఎస్పీ

వేసవికాలంలో సెలవులు రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈతరాని వారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు. ఈత నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని ఆయన సూచించారు.