News March 22, 2025

నిర్మల్: బీఆర్ఎస్ నేతల అరెస్ట్

image

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని పలు మండలాల బీఆర్ఎస్ నేతలను శనివారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీలను పూర్తిగా మాఫీ చేయలేదన్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ఇవ్వడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Similar News

News October 13, 2025

ఎకనామిక్ సైన్సెస్‌లో ముగ్గురికి నోబెల్

image

ఎకనామిక్ సైన్సెస్‌లో జోయెల్ మోకైర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్‌ను నోబెల్ ప్రైజ్ వరించింది. ఇన్నోవేషన్ ఆధారిత ఎకనామిక్ గ్రోత్‌ను వివరించినందుకు గాను వారికి ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్‌లో మోకైర్‌కు అర్ధభాగం, అగియోన్, పీటర్‌కు సంయుక్తంగా మరో అర్ధభాగాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇప్పటికే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, <<17966688>>పీస్<<>>, లిటరేచర్ అవార్డులు ప్రకటించడం తెలిసిందే.

News October 13, 2025

ప్రజావాణికి 88 ఫిర్యాదులు: NZB అదనపు కలెక్టర్

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు అందజేశారు.

News October 13, 2025

స్త్రీనిధి రుణ వాయిదా వివరాల పోస్టర్ ఆవిష్కరణ

image

స్త్రీనిధి రుణ వాయిదా వివరాలు ఉన్న పోస్టర్‌ను కలెక్టర్ డా.వెంకటేశ్వర్ సోమవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం DRDA అదనపు PD డా.ప్రభావతి మాట్లాడుతూ.. ఈ పోస్టర్‌లో చూపిన విధంగా స్త్రీనిధి రుణ వాయిదాలను యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో స్త్రీనిధి AGM హేమంత్ కుమార్, LDM రవి కుమార్, స్త్రీనిధి మేనేజర్లు పాల్గొన్నారు.