News March 14, 2025
నిర్మల్: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఉచిత శిక్షణ

జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. నెలరోజుల శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకులలో ప్లేస్మెంట్ కల్పిస్తారని, డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కన్న వయసు తక్కువగా ఉన్నవారు ఏప్రిల్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News December 1, 2025
ఈ కాల్స్/మెసేజ్లను నమ్మకండి: పోలీసులు

పార్సిల్లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.
News December 1, 2025
వేములవాడ(R) మండలంలో 34 వార్డులు ఏకగ్రీవం

వేములవాడ రూరల్ మండలంలో 34 వార్డుల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలకు సంబంధించి 146 వార్డులలో 34 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జయవరంలో 7, అచ్చన్నపల్లి 5, బొల్లారం 3, చెక్కపల్లి 2, ఫాజుల్ నగర్ 4, మల్లారం 1, నాగయ్యపల్లి 1, నమిలిగుండుపల్లి 1, తుర్కాశినగర్ 5, వెంకటంపల్లిలో 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
News December 1, 2025
HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


