News March 14, 2025
నిర్మల్: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ

జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. నెలరోజుల శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకులలో ప్లేస్మెంట్ కల్పిస్తారని, డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కన్న వయసు తక్కువగా ఉన్నవారు ఏప్రిల్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News March 22, 2025
రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. UPDATE

TG: పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6కేజీల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.
News March 22, 2025
MLAకి రూ.2 లక్షలు చెల్లించండి: విశాఖ కోర్టు

పలాస MLA గౌతు శిరీషకు రూ.2 లక్షలు చెల్లించాలని విశాఖ జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పునిచ్చింది. 2023లో ఆమెపై ఓ పత్రిక అసత్య ఆరోపణలు చేస్తూ వార్త ప్రచురించిందని కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జగదీశ్వరరావుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.