News November 10, 2024
నిర్మల్: భార్యాభర్తల మధ్య గొడవ ఆ తర్వాత.. సూసైడ్
ఒంటరితనంతో మద్యానికి బానిసై మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జయరాజ్ తన భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో స్వప్న పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెంది ఒంటరితనం భరించలేక జయరాజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News December 8, 2024
HYDలో రోడ్డు ప్రమాదం.. బెల్లంపల్లి విద్యార్థి మృతి
HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ బస్తీ 17వ వార్డుకు చెందిన రవితేజ (21) హైదరాబాదులో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి బైక్ పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. వెనకాల వస్తున్న లారీ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
News December 7, 2024
ఆదిలాబాద్: ‘సోమవారం నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలి’
వచ్చే సోమవారం నుండి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలని, గడువులోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు.
News December 7, 2024
ADB: రేవంత్ రెడ్డి ఏడాది పాలన పై REPORT
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి ADB జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, కుప్టీ, తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్ట్ నిర్మాణం, కడెం ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు, సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై మీ కామెంట్?