News February 23, 2025
నిర్మల్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్ జిల్లా పిప్పల్గాంకు చెందిన బీరప్ప(42), బోధన్ మండలం కందుర్కు చెందిన లక్ష్మితో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రానని చెప్పడంతో లోకేశ్వరం మండలంలోని మన్మద్ X రోడ్డు సమీపంలో ఉరేసుకొన్నాడు.
Similar News
News December 29, 2025
బాపట్ల: పది పాసైనా ఉద్యోగం..!

జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. APSDC ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 17 బహుళజాతి కంపెనీలు పాల్గొని 300ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయన్నారు. విద్యార్హతను బట్టి జీతం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. పది ఆపై చదివినవారు అర్హులన్నారు.
News December 29, 2025
వేములవాడ: రేపు మహాశివరాత్రి సమన్వయ సమావేశం

వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి జాతర సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్, జాతర సమన్వయ కమిటీ చైర్మన్ గరీమ అగ్రవాల్ నేతృత్వంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. జాతర కోఆర్డినేషన్ మీటింగుకు హాజరుకావాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆలయ అధికారులు కోరారు.
News December 29, 2025
వేములవాడ: ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన ఆలయ ఈవో, ఏఎస్పీ

వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో ఎల్ రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద శ్రీ స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టిన ఏర్పాట్లను వారు పరిశీలించి ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు.


