News February 23, 2025
నిర్మల్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్ జిల్లా పిప్పల్గాంకు చెందిన బీరప్ప(42), బోధన్ మండలం కందుర్‌కు చెందిన లక్ష్మితో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రానని చెప్పడంతో లోకేశ్వరం మండలంలోని మన్మద్ X రోడ్డు సమీపంలో ఉరేసుకొన్నాడు.
Similar News
News March 24, 2025
జీలుగుమిల్లి: వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేయించిన భార్య

జీలుగుమిల్లి (M) తాటియాకులగూడెంలో సంచలనం రేపిన గంధం బోస్ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్, శాంతకుమారిలు భార్యాభర్తలు. తన మేనమామ సొంగా గోపాలరావుతో శాంతకుమారి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బోస్ అడ్డు తొలగించుకోవాలని గోపాలరావు, శాంతకుమారి ప్లాన్ వేశారు. నిద్రలో ఉన్న బోస్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు.
News March 24, 2025
ఎలుక వల్ల భారీగా షేర్ల పతనం!

అద్భుతంగా రాణిస్తున్న కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయంటే ఆదాయం తగ్గడమో, ప్రపంచ మార్కెట్ ట్రెండ్లో కారణమని అనుకుంటాం. కానీ జపాన్‌కు చెందిన జెన్షో హోల్డింగ్స్ కో అనే రెస్టారెంట్ చెయిన్ షేర్ విలువ మాత్రం ఎలుక కారణంగా పడిపోయింది. ఆ సంస్థకు చెందిన ఓ శాఖలో కస్టమర్‌కి సూప్‌లో ఎలుక వచ్చింది. అతడి ఫిర్యాదుతో హోటల్‌లో పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కంపెనీ షేర్లు 7.1శాతం మేర పతనమయ్యాయి.
News March 24, 2025
KTDM: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ పెంపు

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ ఈనెల 31కి పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని పెంచింది. దీంతో జూన్ చివరిదాకా అక్రిడేషన్ కార్డులు చెల్లుబాటు కానున్నాయి. అక్రిడేషన్ కార్డులను ఆయా జిల్లాల డీపీఆర్ఓల వద్ద మూడు నెలలు పొడగింపుకు సంబంధించిన స్టిక్కర్‌తో బస్సు పాసులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.