News April 15, 2025
నిర్మల్: భూభారతిని క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళ్దాం: కలెక్టర్

భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి సమర్ధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందనిజిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించి ప్రజలు లేవనెత్తి సమస్యలపై సందేహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి రైతుకు భూభారతి పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News February 24, 2026
పార్వతీపురం: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి’

రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రీ సర్వే జరిగే గ్రామాల్లోని సర్వేయర్లు తప్పనిసరిగా సంబంధిత గ్రామంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
News February 24, 2026
రాజకీయాల్లోకి వస్తా : దేవ్ జీ

అజ్ఞాతం వీడిన తాను త్వరలోనే రాజకీయాల్లో వస్తానని మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన తాను ఏ పార్టీలో చేరుతానో ఇప్పటికిప్పుడే చెప్పలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదన్న ఆయన త్వరలోనే పార్టీ జీవితంపై ప్రకటన చేస్తానన్నారు. అనారోగ్య కారణంతోనే తాను అజ్ఞాతం వీడానని, వ్యక్తిగత జీవితం కొనసాగించడం కోసం కాదని స్పష్టం చేశారు.
News February 24, 2026
గణపతి అడవిలో లేరు: డీజీపీ

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి మంగళవారం DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. DGP మాట్లాడుతూ.. రెండేళ్లలో 591మంది మావోయిస్టులు లొంగిపోయారని, ప్రస్తుతం అగ్రనేత గణపతి అడవుల్లో లేరని, బయట ఎక్కడో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న 11 మంది TG నేతల్లో కొందరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.


