News April 5, 2025

నిర్మల్ : ‘భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి’

image

అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఎకరా భూమి విలువైనదని, అటవీ, రెవెన్యూ భూముల హద్దులను తక్షణమే గుర్తించాలన్నారు. ఇందుకోసం రెగ్యులర్ సర్వేలు నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News September 15, 2025

విశాఖలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ

image

విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్‌కు సరెండర్‌ చేశారు. ఎంవీపీ లా అండ్‌ ఆర్డర్‌ సీఐగా ప్రసాద్, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్‌కు ప్రభాకరరావు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సిటీ వీఆర్‌లో ఉన్న భాస్కరరావును నియమించారు.

News September 15, 2025

మహిళల ఆరోగ్యంపై శిబిరాలు: DMHO

image

‘స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్’ పేరిట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ శిబిరాలలో మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, గర్భాశయ క్యాన్సర్, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించి, చికిత్సలు అందిస్తారు. గర్భిణులకు పరీక్షలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

News September 15, 2025

SDPT: ‘స్వచ్ఛత హి సేవా’ పోస్టర్ ఆవిష్కరణ

image

‘స్వచ్ఛత హి సేవా-2025’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. గ్రామాల్లోని ప్రజల సహకారంతో శ్రమదానం, వ్యర్థాల తొలగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.