News March 7, 2025
నిర్మల్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. నిర్మల్లో గాలినాణ్యత విలువ 78గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
Similar News
News December 7, 2025
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
News December 7, 2025
నేడు కడప జిల్లాకు తెలంగాణ డిప్యూటీ CM.!

తెలంగాణ డిప్యూటీ CM బట్టి విక్రమార్కతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పోట్లదుర్తికి రానున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నాయుడు ఇటీవలే మాతృవియోగం అవడంతో ఆయనను పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి వారు పొట్లదుర్తి చెరుకుని అనంతరం అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.
News December 7, 2025
NKD: సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు

ఖేడ్ మండలంలో సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు నిలిచారు. పీర్ల తాండకు చెందిన సాలిబాయి, ఆమె మనువడు సచిన్ నామినేషన్ వేశారు. ఇరువురి నామినేషన్లు సక్రమంగానే ఉండగా ఈనెల 9న సచిన్ నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు. దీంతో సాలిబాయి ఏకగ్రీవం కానున్నారు. 8 వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో జీపీ పాలకవర్గం ఏకగ్రీవం అయినట్టే. ఈమె భర్త జీవులనాయక్ 1987లో ఖేడ్ ప్రథమ MPP అయ్యారు. ఈయన సర్పంచ్గానూ పనిచేశారు.


