News March 7, 2025

నిర్మల్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. నిర్మల్‌లో గాలినాణ్యత విలువ 78గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

Similar News

News March 19, 2025

పోసాని బెయిల్ పిటిషన్.. 21న తీర్పు

image

AP: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి ఈ నెల 21కి తీర్పును వాయిదా వేశారు. ఈ కేసులో గుంటూరు జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. సీఐడీ కేసులోనూ బెయిల్ వస్తే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 19, 2025

మమ్మల్ని కూటమి సర్కార్ అవమానిస్తోంది: బొత్స

image

AP: శాసనమండలిలో వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. MLA, MLC క్రీడా పోటీల్లో కూడా తమపై వివక్ష చూపారని ఆయన మండిపడ్డారు. ‘నిన్న జరిగిన ఫొటో సెషన్‌లో నాకు కుర్చీ వేయలేదు. ఇతరులకు కేటాయించిన కుర్చీలో కూర్చోమన్నారు. క్రీడా పోటీల సందర్భంగా CM, స్పీకర్ ఫొటోలు మాత్రమే వేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఫొటో వేయలేదు’ అని ఫైర్ అయ్యారు.

News March 19, 2025

ఈనెల 26 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

image

రాజంపేట మండలం తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ అధికారిని హేమలత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, సప్తగిరిల సంకీర్తన, గోష్టి గానం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ, శ్రీరామ పాదుకలు నాటకం ఉంటుందని తెలిపారు.

error: Content is protected !!