News March 10, 2025
నిర్మల్: ‘మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి’

ఆరోగ్యంపై మహిళలందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి, వారి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి వైద్య శిబిరం ఎంతో దోహదం చేస్తుందన్నారు.
Similar News
News December 10, 2025
కామారెడ్డి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉదయ్ కిరణ్, అబ్దుల్ సమీర్ వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఇన్ఛార్జి పీడీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కళాశాల నుంచి జాతీయస్థాయికి విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.
News December 10, 2025
2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్త్: వరంగల్ సీపీ

రేపు జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో డీసీపీలు ముగ్గురు, అదనపు డీసీపీలు 11 మంది, 13 మంది ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


