News November 26, 2024

నిర్మల్: మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన అదనపు కలెక్టర్

image

మహిళా శక్తి క్యాంటీన్లు మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. సోమవారం పట్టణంలోని వైద్య కళాశాలలో మహిళా శక్తి క్యాంటీన్‌ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. మహిళా స్వయం సంఘాలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఆర్థికంగా బలపడడానికి తోడ్పడతాయన్నారు. ఈ మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా వైద్య విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.

Similar News

News December 4, 2025

ADB: ‘సైనికుల సహాయార్థం విరాళాలు అందించాలి’

image

దేశ రక్షణకు సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సైనిక పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఎన్‌సీసీ క్యాడెట్లు జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తారన్నారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణకు శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.

News December 4, 2025

ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

image

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.