News April 7, 2025
నిర్మల్: మానవత్వం చాటుకున్న RTC కండక్టర్

ఆర్టీసీ బస్సులో దొరికిన పర్సును అందజేసి నిజాయితీని చాటుకున్నాడు కండక్టర్ నారాయణ. ఆదివారం నిర్మల్ నుంచి భైంసా వెళ్లే ఆర్టీసీ బస్సులో రాంపూర్ వరకు ప్రయాణించిన ఓ మహిళ బస్సులోనే పర్సును మరిచిపోయారు. పర్సులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెని పిలిపించి రూ.10 వేల నగదు, పర్సును అందజేశారు. డిపో మేనేజర్ పండరి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ పలువురు ఆయనను అభినందించారు.
Similar News
News October 24, 2025
టుడే టాప్ స్టోరీస్

* హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని TG క్యాబినెట్ నిర్ణయం
* ఇండియా టెక్ డెస్టినేషన్గా AP: CM CBN
* జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలి: KCR
* తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా రానిచ్చారు.. బాలకృష్ణపై జగన్ ఫైర్
* నా కుమార్తె మాటలపై సీఎంకు క్షమాపణలు: కొండా సురేఖ
* ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ ఓటమి
* మళ్లీ తగ్గిన బంగారం ధరలు
News October 24, 2025
న్యూజిలాండ్పై విజయం.. సెమీస్కు భారత్

WWCలో న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచులో టీమ్ ఇండియా DLS ప్రకారం 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ <<18085029>>340<<>> పరుగులు చేసింది. ఛేదనలో వర్షం కురవడంతో లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్దేశించారు. భారత బౌలర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 271 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ చేరింది.
News October 24, 2025
HYD: రామంతాపూర్లో బెట్టింగ్లకు బలైన డిగ్రీ విద్యార్థి

HYD రామంతాపూర్ కేసీఆర్ నగర్లో ఆన్లైన్ బెట్టింగ్లకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అరుణ్(18) దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి రజిత ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.