News March 28, 2025
నిర్మల్: మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది: ఎస్పీ

మీరు బాగుంటేనే సమాజం భద్రంగా ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో ఎండనకా వాననక నిరంతరం విధులు నిర్వహించే సిబ్బంది బాగుండాలని తెలిపారు. 30 ఏళ్ల వయసు పైబడిన 703 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 16, 2025
పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.
News December 16, 2025
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News December 16, 2025
పాత నేరస్తులపై నిఘా పెట్టండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. గతంలో చోరీలకు పాల్పడిన నిందితుల సమాచారాన్ని, వారి కదలికలను నిరంతరం సేకరించాలని సూచించారు. వారిపై గతంలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత నివాసంపై దృష్టి సారించి నిఘా పెట్టాలని ఆదేశించారు.


