News December 31, 2024

నిర్మల్: యువకుడిపై అత్యాచారం కేసు నమోదు

image

సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఓ మహిళ NZB 1 టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. SHO రఘుపతి వివరాల ప్రకారం.. భర్తతో గొడవ పడి నిర్మల్‌కు వెళ్లిన మహిళను గౌతమ్ ఈ నెల 17న NZBకి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు SHO వెల్లడించారు.

Similar News

News January 7, 2025

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 29 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.

News January 7, 2025

మందమర్రి ఏరియాలో పర్యటించిన డైరెక్టర్

image

సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి మందమర్రి ఏరియాలో సోమవారం పర్యటించారు.GM దేవేందర్‌తో కలిసి ఏరియాలోని KK-OCPసందర్శించి పని ప్రదేశాలను పరిశీలించారు. ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షించారు. రవాణాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు అంకితాభావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువుతుందన్నారు.

News January 7, 2025

ఖానాపూర్‌లో చైనా మాంజా కలకలం

image

ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చైనా మాంజా తగిలి ఒకరు గాయపడ్డారు. ఆ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ పనిలో భాగంగా చేపలు పట్టడం కోసం సోమవారం గోదావరికి వెళ్తున్న సమయంలో జూనియర్ కాలేజ్ రోడ్డుపై పడిన చైనా మాంజా అకస్మాత్తుగా ఆయన గొంతుకు తగిలి కట్టయ్యింది. స్థానికులు ఆయనను మొదట ఖానాపూర్ ఆస్పత్రికి, అటు నుంచి నిర్మల్ ఆసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు పడ్డాయి. ఈ సంఘటన ఖానాపూర్‌లో సంచలనం రేపింది.