News May 17, 2024
నిర్మల్: రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు
హైదరాబాద్‌లోని శ్రీ నీలకంఠ విద్యాపీఠంలో ఈ నెల 16, 17తేదీల్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్రస్థాయి అభ్యాస వర్గలో జిల్లాకు చెందిన పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర, విద్య ఆధారంగా జాతి నిర్మాణం, దేశభక్తి, నూతన జాతీయ విద్యావిధానం, ఆదర్శ ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వంటి పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తపస్ నాయకులు తెలిపారు.
Similar News
News January 26, 2025
ADB: నాగోబా స్పెషల్.. ఎందరొచ్చినా 22 పొయ్యిలే
ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. జాతరకు మెస్రం వంశీయులు వేలాదిగా తరలివస్తారు. కానీ వారు వంట చేసుకోవడానికి అక్కడ 22 పొయ్యిలను మాత్రమే వినియోగిస్తారు. అయితే ఈ పొయ్యిలను ఎక్కడపడితే అక్కడ పెట్టరు. ఆలయ ప్రాంగణంలోని గోడ లోపల వెలిగే దీపాలు వెలుగుల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తారు. వంట పాత్రలు, వాటి మీద కప్పడానికి మూతలను సిరికొండలోని గుగ్గిల్ల వంశస్థులు తయారు చేస్తారు.
News January 26, 2025
ADB: బ్యాంకు లాకర్‌లో బంగారం ఆభరణాలు మాయం
ఆదిలాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో నుంచి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల బ్యాంకు ఉన్నతాధికారులు సాధారణ తనిఖీలు చేపట్టగా, బ్యాంకు లాకర్‌లో నుంచి 507.4 గ్రాముల బంగారు ఆభరణాలు మిస్సైనట్లు తనిఖీల్లో తేలింది. వీటి విలువ రూ. 29 లక్షల 20 వేలు ఉంటుంది. బ్యాంకు అధికారుల ఆదేశాల మేరకు బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 26, 2025
ఇంద్రవెల్లి: పాము కాటుతో రైతు మృతి
పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.