News May 5, 2024
నిర్మల్: రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ సభాస్థలి ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పరిశీలించారు. హెలి ప్యాడ్, పార్కింగ్, తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.
News September 17, 2025
ADB: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. ఈనెల 18, 19న అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. బీఏలో 1, బీకాం (సీఏ)లో 3, బీఎస్సీ బీజేడ్సీలో 3, ఎంపీసీఎస్‌లో 14 , డాటా సైన్స్‌లో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు 9849390495 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
News September 17, 2025
ఆదిలాబాద్ జిల్లా వెదర్ అప్డేట్

ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 13.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. రైతులు వాతావరణ పరిస్థితులు గమనించి సాగు పనులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.