News February 7, 2025
నిర్మల్ రూరల్: ‘విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి’

విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని జిల్లా విద్యాధికారి రామారావు అన్నారు. గురువారం నిర్మల్ మండలం వెంగువాపేట్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
Similar News
News October 14, 2025
బాలికలు రాణిస్తేనే దేశం పురోగతి సాధిస్తుంది: జిల్లా జడ్జి

బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం పురోగతిని సాధిస్తుందని జిల్లా జడ్జి పుష్పలత తెలిపారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సంబంధిత విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి బహుమతులు అందజేశారు. పాఠశాల సిబ్బంది, న్యాయసేవా సభ్యులు పాల్గొన్నారు.
News October 14, 2025
తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.
News October 14, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <