News March 18, 2025

నిర్మల్: రెవెన్యూ ఉద్యోగిపై దాడి.. కలెక్టర్ చర్యలకు ఆదేశం

image

ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణలో ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం రాత్రికి ఒక ప్రకటనలో తెలిపారు. తానూరు మండలం బోరిగామ గ్రామంలో రెవెన్యూ ఉద్యోగిపై దాడి ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు.

Similar News

News April 22, 2025

అల్లూరి: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదోతరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. అల్లూరి జిల్లాలో 258 పాఠశాలల నుంచి 11,766 మంది పరీక్ష రాయగా వారిలో 5,476 మంది బాలురు, 6,290 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 11,564 మంది కాగా ప్రైవేట్‌గా 202 మంది పరీక్ష రాశారు. 71 సెంటర్లలో పరీక్షలు జరగ్గా తెలుగు మీడియం 8,140, ఇంగ్లిష్ మీడియం 3,626 మంది ఉన్నారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

News April 22, 2025

ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.

error: Content is protected !!