News March 14, 2025

నిర్మల్ : రేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖలను అందించాలన్నారు. సమావేశంలో ఏజెండాలోని అన్ని అంశాలను చర్చించేలా చర్యలు తీసుకోవాలని HMలకు సూచించారు.

Similar News

News December 7, 2025

నెల్లూరులో బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి

image

నెల్లూరులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 7, 2025

రాష్ట్రస్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం

image

హైదరాబాద్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి బాలురు, బాలికల ఖో ఖో ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం సాధించాయి. బాలుర జట్టు రంగారెడ్డి జిల్లాపై, బాలికల జట్టు నల్లగొండ జిల్లాపై గెలుపొందాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా డీఐఈఓలు విద్యార్థులను, కోచ్, మేనేజర్లు, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావును అభినందించారు.

News December 7, 2025

ప్రకాశం: NMMS -2025 పరీక్షకు 196 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన NMMS -2025 స్కాలర్షిప్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 19 కేంద్రాల్లో 4009 మంది విద్యార్థులకు గాను 3813 మంది హాజరయ్యారన్నారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని డీఈవో తెలిపారు.