News March 14, 2025
నిర్మల్ : రేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖలను అందించాలన్నారు. సమావేశంలో ఏజెండాలోని అన్ని అంశాలను చర్చించేలా చర్యలు తీసుకోవాలని HMలకు సూచించారు.
Similar News
News March 23, 2025
TODAY HEADLINES

* డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్
* కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం చంద్రబాబు
* ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: లోకేశ్
* రూ.2 లక్షలపైన ఉన్నవారికి రుణమాఫీ చేయం: తుమ్మల
* నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్
* డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* జైలు నుంచి పోసాని విడుదల
* టాలీవుడ్ దేశంలోనే బెస్ట్: మోహన్‌లాల్
* కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం
News March 23, 2025
₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోందన్నారు.
News March 23, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదు’

జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలు ఎక్కడైనా పంట నష్టం జరిగితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.