News March 4, 2025

నిర్మల్: లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: ఎస్పీ 

image

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ నెల 8న నిర్మల్, ఖానాపూర్, భైంసా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను రాజీ చేసుకోవాలన్నారు.

Similar News

News October 17, 2025

ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

image

సాధారణంగా స్వీట్స్ కేజీకి రూ.2వేల వరకూ ఉండటం చూస్తుంటాం. కానీ జైపూర్ (రాజస్థాన్)లో అంజలి జైన్ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ స్వీట్ KG ధర ₹1.11 లక్షలు. దీనిని చిల్గోజా, కుంకుమపువ్వు, స్వర్ణ భస్మంతో తయారుచేసి బంగారం పూతతో అలంకరించారు. బంగారు భస్మం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేదంలో ఉందని ఆమె తెలిపారు. అలాగే స్వర్ణ్ భస్మ భారత్ (₹85,000/కిలో) & చాంది భస్మ భారత్ (₹58,000/కిలో) కూడా ఉన్నాయి.

News October 17, 2025

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ నర్సింహా

image

నూతనంగా నిర్మిస్తున్న అనంతగిరి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నర్సింహా శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు నాణ్యంగా, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

News October 17, 2025

మక్తల్: మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, సుందరీకరణ పనుల శంకుస్థాపనను మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వాకిటి శ్రీహరి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు రూ.3.70 లక్షల నిధులతో సీడీఎంఏ ప్రత్యేక నిధుల కింద ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రులు తెలిపారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా చెరువు కట్టపై మొక్కలు నాటారు. పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.