News November 6, 2024
నిర్మల్: విద్యార్థి మృతి పట్ల బీసీ శాఖ మంత్రి సంతాపం
దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన విద్యార్థి ఆయాన్ హుస్సేన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలిపారు. విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
Similar News
News November 6, 2024
దండేపల్లి: రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి
దండేపల్లి మండలంలోని మేదర్ పేట రోడ్డుపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మేదరిపేటలో రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని లక్సెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లికి చెందిన బోనాల మహేశ్ (34) అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు కార్పెంటర్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2024
నర్సాపూర్ (జి): సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య
సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ (జి) మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమాన్లు వివరాలు.. నిజామాబాద్ జిల్లా రాంనగర్‌కు చెందిన దినేష్ (22) తన భార్య బంధువులు బుర్గుపల్లికి వచ్చారు. నిన్న సాయంత్రం బయటకు వెళ్తునానని బైక్‌పై వెళ్లి గ్రామ సమీపంలోని సుద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అన్నారు.
News November 5, 2024
ఆదిలాబాద్: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.