News February 2, 2025

నిర్మల్: ‘వివాహితతో రాసలీలలు.. సీసీ సస్పెండ్’

image

ఇటీవల నిర్మల్ పట్టణంలో కలెక్టర్ సీసీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రాకేష్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విధుల నుంచి తొలగించారు. కలెక్టర్ మాట్లాడుతూ..  ఓ వివాహితతో రాసలీలలు నిర్వహిస్తుండగా పట్టుపడడంతో విచారణ చేపట్టామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

Similar News

News February 2, 2025

నంద్యాలలో పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి

image

పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారు ప్రాంతంలోని నందమూరి నగర్‌కు చెందిన గౌస్‌కు రోజాకుంట వీధికి చెందిన హరికి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద వీరిద్దరూ ఎదురుపడగా హరిపై గౌస్ కత్తితో దాడి చేశాడు. నంద్యాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 2, 2025

పాలకొండ: ఇంటర్ విద్యార్థి మృతి

image

హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 2, 2025

ఆత్మకూర్ : మేకలు, గొర్రెల దొంగల ముఠా అరెస్ట్

image

గోర్లు, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు కాప్రాయిపల్లి వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLGజిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.