News March 30, 2024
నిర్మల్: వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ
నిర్మల్ పట్టణంలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారం గొలుసు అపహరించుకుపోయాడు. సారంగాపూర్ మండలానికి చెందిన ఓ వృద్ధురాలు శుక్రవారం నిర్మల్ బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురుచూస్తోంది. ఓ వ్యక్తి అదును చూసి ఆమె మెడలోని బంగారు ఆభరణం అపహరించి పారిపోయాడు. బస్ స్టాండ్ గోడ దూకి తప్పించుకునే యత్నంలో స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసారు. పోలీస్ లకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 21, 2025
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నార్నూర్ రోడ్డు ప్రమాదం: ASP
నార్నూర్ మండలంలో ఐచర్ బోల్తా ఘటన ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్ కనక శ్రీరామ్ ఐచర్ వాహనం నడిపినట్లు పేర్కొన్నారు. డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతి చెందగా.. 35 మందికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News January 21, 2025
అభయారణ్యంలో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు: ఖానాపూర్ MLA
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియాల్‌ను సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కలిశారు. కవ్వాల్ అభయారణ్యంలో ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టవద్దని, వాహనాలను ఆపవద్దని కోరారు. అలాగే ఆర్ఓఆర్‌లో రైతులను కూడా ఇబ్బంది పెట్టవద్దని విన్నవించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం ఉన్నారు.
News January 21, 2025
బాసర: ఆర్జీయూకేటీ బలోపేతానికి చర్యలు: వీసీ
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ కాన్ఫరెన్స్ హాల్‌లో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యక్షతన సమావేశం సోమవారం నిర్వహించారు. OSD మురళీధర్షన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇంజినీర్ రెండో సెమిస్టర్ ప్రారంభంలో తీసుకోవాల్సిన చర్యలు, అకాడమిక్స్ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చి వర్సిటీ బలోపేతానికి చర్యలు చేపడతామని వీసీ పేర్కొన్నారు.