News January 30, 2025

నిర్మల్: ‘వేసవిలో బోరు బావులు వేయవద్దు’

image

నిర్మల్ జిల్లాలో అధికంగా బోరుబావులు వాడటం వల్ల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని, వేసవిలో బోరుబావులు వేయవద్దని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం 12% అధికంగా ఉన్నందున వ్యవసాయం కోసం ఎక్కువ భూగర్భ జలాలు వాడుతున్నారని తెలిపారు. జిల్లాలో 45 వేలకు పైగా బోరుబావులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 11, 2025

పెద్దపల్లి: అతి తక్కువ ధరకు మట్టి, మొరం: కలెక్టర్

image

జిల్లాలో ప్రజలకు సొంత అవసరాల కోసం అవసరమైన మట్టి, మొరం తీసుకునేందుకు తహశీల్దారుల ద్వారా అతి తక్కువ ధరకు అనుమతి మంజూరు అవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మట్టి, మోరం సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక ట్రాక్టర్‌కు రూ.200, టిప్పర్‌కు రూ.800 రుసుము తహశీల్దార్లకు చెల్లించి అనుమతి పొందాలన్నారు.

News February 11, 2025

అమరావతికి రూ.11వేల కోట్ల రుణం.. హడ్కో గ్రీన్ సిగ్నల్

image

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుండగా, హడ్కో ఇచ్చే అప్పు విషయంలోనూ ముందడుగు పడింది. రూ.11వేల కోట్ల రుణంపై ముంబైలో జరిగిన పాలకమండలి భేటీలో అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత పత్రాలను సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబుకు అందించారు. నాలుగు నెలల్లో లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

News February 11, 2025

MBNR: జీరో(0) బిల్లు.. ఉమ్మడి జిల్లాలో ఎంతమందంటే!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.

error: Content is protected !!