News February 5, 2025

నిర్మల్ వైద్య కళాశాలలో JOBSపై UPDATE

image

నిర్మల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో 52 ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా కళాశాల నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంటుందని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అధ్యక్సఉడు దుర్గం శేఖర్ తెలిపారు. ఈనెల 5 నుంచి 8 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

ఎప్‌స్టీన్ మరణశాసనం.. ఒక రోజు ముందే రాసేశారా?

image

US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ 2019 AUG 10న మాన్‌హట్టన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతడి మరణ ప్రకటన AUG 9వ తేదీనే రూపొందించినట్టు తాజాగా విడుదలైన ఫైల్స్ చూపిస్తున్నాయి. అది ఆత్మహత్య అని అధికారులు చెప్పినా తేదీలో వ్యత్యాసం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనితో పాటు 9వ తేదీ రాత్రి CCTV దృశ్యాలు, చనిపోయాక తీసిన ఫొటోల్లో అతడి ఫస్ట్ నేమ్‌ తప్పుగా ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి.

News February 9, 2026

NGKL: జిల్లాలో ముగిసిన మున్సిపల్ ప్రచారం

image

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల బహిరంగ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టారు. మైకులు మూగబోవడంతో పోలీసులు మద్యం, నగదు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 13న ఫలితాలు వెలువడనున్నాయి.

News February 9, 2026

కల్తీ జరిగింది మీ హయాంలో కాదా: విడదల రజిని

image

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో CM CBNకు మాజీ మంత్రి విడదల రజిని కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘2024 JULY 6న వచ్చిన 2 ట్యాంకర్లు, JULY 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యిని TTD ల్యాబ్ పరీక్షించి, నాణ్య‌తా ప్ర‌మాణాలు లేవ‌ని వెనక్కి పంపింది వాస్త‌వం కాదా? ఆ లారీలు దొడ్డిదారిన తిరిగి వ‌చ్చింది మీ పాల‌న‌లోనే క‌దా? ఒక‌వేళ క‌ల్తీ జ‌రిగి ఉంటే అది మీ హ‌యాంలోనే క‌దా? దీనికి మీ స‌మాధాన‌మేంటి?’ అని ట్వీట్ చేశారు.